ఆ క్రేజీ సినిమాలో కూడా జాన్వీనే హీరోయిన్.. బోనీకపూర్ చెప్పేశాడుగా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తూ ఉన్నాడు
ఈ సినిమా తర్వాత 'ఆర్‌సీ16' పేరుతో కొత్త సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
ఉప్పెన సినిమా ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారనే విషయంపై పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి
రామ్ చరణ్ కొత్త సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనుంది
ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కన్ఫామ్ చేశారు
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీకపూర్ చెబుతూ 'రామ్ చరణ్ తో జాన్వీ నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది’ అని తెలిపారు
రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఏప్రిల్ నుంచి 'ఆర్‌సీ16' సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది
జాన్వీ కపూర్ కు తెలుగులో ఇది రెండవ సినిమా. ఇప్పటికే ఆమె దేవర సినిమాలో నటిస్తూ ఉంది
బాలీవుడ్ లో పెద్దగా హిట్స్ లేని జాన్వీకి తెలుగులో స్టార్ హీరోలు హిట్స్ ఇస్తారేమో చూడాలి