ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్ 'ఆవేశం'

దక్షిణాదిలో గొప్ప నటుల్లో ఫహద్ ఫాసిల్ ఒకరు. ఆయన సినిమాలను మూవీ లవర్స్ ముందు నుండి బాగా చూసేవారు. పుష్ప సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు
ఫహద్ ఫాసిల్ నటించిన చిత్రం 'ఆవేశం' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా OTT లో విడుదలైంది
మే 9 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీకి వచ్చింది
దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన 'ఆవేశం' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది
ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు దాటినట్లు సమాచారం
ఈ సినిమా థియేటర్లలో ఇంకా బాగా రన్ అవుతూ ఉంది. గత ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది
అయినప్పటికీ మేకర్స్ ముందస్తుగా OTT విడుదలను ఎంచుకున్నారు. విశ్వసనీయ మూలం ప్రకారం ‘ప్రైమ్ వీడియో’ ఈ సినిమా కోసం రికార్డు మొత్తం అందించి దక్కించుకుంది
ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇది మలయాళ చిత్రానికి సంబంధించిన ఆల్ టైమ్ రికార్డ్
ఆవేశం చిత్రానికి జిత్తు మాధవన్ రచన, దర్శకత్వం వహించారు. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చగా, ఇందులో హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు కీలక పాత్రల్లో నటించారు