సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈరోజు ఆమె పుట్టినరోజు.

బాలీవుడ్ లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఇప్పుడు సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్
సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ‘హాయ్ నాన్న’ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్‌గా విడుదలకానుంది
విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా ఈ భామనే హీరోయిన్‌గా నటిస్తోంది
టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించింది మృణాల్ ఠాకూర్. మరాఠి సినిమా ‘విట్టి దండు’ సినిమాలో మంచి ప్రదర్శన చేసింది
మృణాల్ కెరీర్ లో 'లవ్ సోనియా' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడింది
మృణాల్ ఠాకూర్ తొలిసారి హిందీలో కనిపించిన చిత్రం ‘లవ్ సోనియా’. ఆ తర్వా త హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’లో యాక్ట్ చేసింది. ఇందులో తన నటనతో మెప్పించింది
హిందీలో తుఫాన్, ధమాకా సినిమాలతో పలకరించిన ఈమె ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాలో కూడా సందడి చేసింది
'హాయ్ నాన్న' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ ను విడుదల చేసింది మూవీటీమ్