కల్కి 2898 ట్రైలర్ లో ఈ విషయాలు మీరు గుర్తించారా?

ప్రభాస్-దీపికా పదుకోన్-అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా కల్కి 2898. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకు ట్రైలర్ ఊహించని ప్లస్ గా మారింది.
ట్రైలర్ లోని VFX, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండడం నాగ్ అశ్విన్ విజన్‌కు నిదర్శనం. ట్రైలర్ ను ఫ్రేమ్-టు-ఫ్రేమ్‌ను చూసిన నెటిజన్లు అందులో దాచిన అనేక వివరాలను గమనించారు
హిందూ పురాణాల ప్రకారం, కల్కి విష్ణువు యొక్క పదవ అవతారం. కల్కి తల్లి పేరు సుమతి.
అశ్వత్థామగా నటిస్తున్న అమితాబ్.. దీపికతో, “నీ కడుపులో దేవుడు ఉన్నాడు” అని చెప్పడం మనకు కనిపిస్తుంది. అంటే ఆమె గర్భవతి అని.. కడుపులో కల్కిని మోస్తోందని స్పష్టంగా అర్థం అవుతుంది
ఒక సన్నివేశంలో '5 నెలల గర్భిణీ స్త్రీ', ఆమె పేరు SUM-80 అని పేరు ఉంటుంది. దీపికను పట్టుకోడానికి భైరవ వస్తాడు. SUM అంటే సుమతీ.. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ స్పష్టంగా చూపించాడు
మహావిష్ణువు చివరి అవతారం అయిన కల్కి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని మొదటి నుండి భావిస్తూ ఉన్నారు. కానీ కేవలం బౌంటీ హంటర్ గా ఉన్నాడు. భైరవ యూనిట్ల కోసం దీపికను వేటాడతాడు, ఫలితంగా అతనికి, అశ్వత్థామకు మధ్య యుద్ధం జరుగుతుంది
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అమరులలో ఒకరైన అశ్వత్థామగా నటిస్తున్నాడు. బుజ్జిని ఒంటికాలితో ఆపి, నలుగురు విలన్‌లను ఒంటి చేత్తో పట్టుకున్నప్పుడు అతని పవర్ మనకు కనిపిస్తుంది
ఒక సన్నివేశంలో.. భైరవని నెట్టడం కూడా మనం చూస్తాము. అతనికి, అశ్వత్థామకు మధ్య సైజులో తేడా కూడా స్పష్టంగా కనిపిస్తుంది
కలియుగంలో ప్రధాన విలన్ అయిన కలి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 27న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.