దుంప జాతికి చెందిన కూరగాయల్లో క్యారెట్ ఒకటి.

నారింజ, ఊదా, ఎరుపు రంగులలో క్యారెట్లు లభిస్తాయి.
క్యారెట్లలో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె సమస్యలను నివారించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది.
ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ.. చర్మం, జుట్టు గోళ్లను పొడిబారకుండా రక్షిస్తుంది. అలాగే చర్మం ముడతలు, ముఖంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది.
క్యారెట్ తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగ్గా ఉంటుంది. వీటిలో ఉండే కెరోటిన్ దృష్టిని మెరుగుపరుస్తుంది.
లాలాజలం మరియు జీర్ణక్రియను పెంచడానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లను క్యారెట్లు అందిస్తాయి.
ప్రతినిత్యం క్యారెట్లను తినడం వల్ల పొట్టలో పుండ్లు, ఇతర జీర్ణ వ్యాధులు నివారణ అవుతాయి.