ఆసియా గేమ్స్ కు సరికొత్త కల రాబోతోంది. ఈ ఏడాది జరిగే ఆసియా గేమ్స్ లో భారతజట్టు సందడి చేయబోతోంది.

ఈ ఏడాది జరిగే ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొననున్నాయి
ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్‍కు భారత టీమ్‍లను పంపాలని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) నిర్ణయించుకుంది
చైనాలోని హాంగ్‍జౌ వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ మధ్య ఆసియా గేమ్స్ జరగనున్నాయి
ఇదే సమయంలో పురుషుల వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఆసియా గేమ్స్‌కు ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది
ప్రపంచకప్‍లో టీమిండియాలో చోటు లభించని ఆటగాళ్లతోనూ, ఐపీఎల్ ప్లేయర్లతోనూ ఆసియా కప్ పురుషుల టీమ్ నిండిపోనుంది
జూలై 15వ తేదీలోగా ఆసియా క్రీడలకు పంపే జట్లను బీసీసీఐ ప్రకటించనుంది
ఈ ఏడాది ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 19న భారత మహిళల జట్టు మ్యాచ్‍లు ఆరంభం కానున్నాయి. భారత పురుషుల టీమ్ సెప్టెంబర్ 28న మ్యాచ్ లు ఆడనుంది.
రోహిత్‌ శర్మ సారథ్యంలోని ప్రధాన జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో ఆడుతున్న సమయంలో.. ద్వితీయ శ్రేణి జట్టు ఆసియా గేమ్స్‌లో పాల్గొననుంది