మెగా స్టార్ చిరంజీవిని వరించిన అవార్డులు

మెగాస్టార్ చిరంజీవి భారతదేశ సినీ చరిత్రలో ఓ గొప్ప నటుడిగా పేరు సంపాదించారు. 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో ఎదిగారు
ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచారు. గత కొన్ని రోజులుగా ఆయన పద్మ విభూషణ్ రాబోతోందంటూ ప్రచారం జరగగా.. అది నిజమేనని తేలుస్తూ అధికారిక ప్రకటన వచ్చింది
సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది
తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది
2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది
2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు
2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది
1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి నిలిచారు
1987లో స్వయం కృషి, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు
శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు