షాకుల మీద షాక్ ఇస్తున్న ఆపిల్

ఆపిల్ తీసుకుని వచ్చే కొత్త మొబైల్ ఫోన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంటుంది. ఎగబడి మరీ కొంటారు
ఆపిల్ త్వరలోనే iPhone 16 సిరీస్‌ను తీసుకుని రాబోతోంది. ఈసారి ఏకంగా బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ను కూడా తీసుకుని రావాలని ఆపిల్ యోచిస్తోంది
2025 నాటికి, వినియోగదారులు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను మార్చుకోవాలనే కొత్త యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లో మార్పులను తీసుకుని వచ్చే అవకాశం ఉంది
ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, టెక్ దిగ్గజం బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి డీబాండింగ్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని అన్వేషిస్తోంది
ఐఫోన్ 16 ప్రో ప్రస్తుత బ్లాక్ ఫాయిల్ డిజైన్‌ లీకైన చిత్రాలలో ఉంది. ఈ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీ ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 16కు సంబంధించి కనీసం ఒక మోడల్‌లో అయినా వస్తుందని అంచనా వేస్తున్నారు
వచ్చే ఏడాది నాటికి ఇది ఐఫోన్ 17 సిరీస్ లోని అన్ని వెర్షన్లలో ఉండొచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఏదీ ధృవీకరించలేదు
ఆపిల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కంపెనీ తన అధునాతన AI సామర్థ్యాల కోసం డబ్బులను వసూలు చేయవచ్చు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. కంపెనీ తన AI ఫీచర్లను మోనటైజ్ చేసే అవకాశం ఉంది, భవిష్యత్తులో "యాపిల్ ఇంటెలిజెన్స్+" అనే పేరుతో ఒక సేవను ప్రారంభించే అవకాశం ఉంది
AI ఫీచర్లు, ఇతర సాఫ్ట్‌వేర్‌లను పెయిడ్ సర్వీసులుగా మార్చడానికి అవకాశం ఉంది, అయితే దీనికి సమయం పడుతుందని నివేదిక తెలిపింది