గుండె సంబంధిత రోగాలు ప్రజలను ఎంతగానో ఇబ్బందిపెడుతూ ఉన్నాయి. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ లు వస్తూ ఉండడం ఆందోళనకరం. గుండె సంబంధిత వ్యాధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది
గుండెపోటు సంభవించిన తొలి గంట చాలా కీలకమని.. దీనిని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
గుండెపోటు కారణంగా జరిగే మరణాలను తగ్గించేందుకు ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి (STEMI) కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది
సెప్టెంబర్ 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు
స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు.. బాధితులకు వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌)ను ఇవ్వగలిగితే ప్రాణాలను కాపాడవచ్చు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో స్టెమి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ప్రిన్సిపల్ సెక్రటరీ (వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) ఎంటీ కృష్ణబాబు తెలిపారు
సాధారణంగా ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేలు. అనంతరం 100 కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పిటల్ కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్రచికిత్స చేస్తారు
అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ ను నిర్మించింది
గుంటూరు, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రులను హబ్స్ గా చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చింది
అవసరమైన వారికి రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌ ఉచితంగా బాధితులకు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు