తిరుమలలో చంద్రబాబు నాయుడు కుటుంబం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు
చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు ఉన్నారు
సీఎం చంద్రబాబును చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం బుధవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. చంద్రబాబు కుటుంబం గాయత్రి నిలయంలో బస చేసింది
చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రులతో సమావేశం నిర్వహించి తిరుమలకు వచ్చారు
చంద్రబాబు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి 8.45 గంటల సమయంలో శ్రీగాయత్రి నిలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్న గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయం దగ్గర టీడీపీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురుచూశాయి
చంద్రబాబు అతిథిగృహానికి వెళ్తుండగా కార్యకర్తలు ఒక్కసారి తమను కలిసి వెళ్లాలని కోరారు. ఆయన వర్షంలోనూ గొడుగుతో ఆయన వారి దగ్గరకు వెళ్లి పలకరించారు
సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జూన్ 13న ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతకాలు చేస్తారు