అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహ వార్షికోత్సవం.. లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే?

బాలీవుడ్ కు క్రికెట్ కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో ప్రేమ జంటలు కొన్ని దశాబ్దాల కాలం నుండి కొనసాగుతూనే ఉన్నాయి.
స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే
2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కష్ట సుఖాల్లో ఈ జంట కలిసే ఉన్నారు. ఒకానొక సమయంలో అనుష్క గ్రౌండ్ కు వస్తుంటే తిట్టిపోశారు కొందరు.. కానీ అదే అనుష్క ఇప్పుడు గ్రౌండ్ కు రాకపోతే వదినమ్మ ఎక్కడా అని అడుగుతున్నారు.
వీరిద్దరూ అత్యంత డౌన్ టు ఎర్త్ సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఒకరి మీద మరొకరు ప్రేమను చూపించుకోడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు
అనుష్క శర్మ, విరాట్ కోహ్లిల అద్భుతమైన ప్రయాణం గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. ఈ జంట వారి ఆరవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు
విరాట్ కోహ్లీ అనుష్క శర్మను ఒక యాడ్ షూటింగ్ సమయంలో కలుసుకున్నాడు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది
ముఖ్యంగా విరాట్ కోహ్లీ T-20 మ్యాచ్‌లలో రాణించనప్పుడు అనుష్క శర్మ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. విరాట్ ఆట ఆమె కారణంగానే కుంటుపడిందని కొందరు వ్యక్తులు అనుష్కను నిందించారు
కానీ విరాట్ కోహ్లీ వెంటనే అనుష్కను సమర్థించాడు. అనవసరమైన విమర్శలు తనకు ఇష్టం లేదని.. తన వ్యక్తిగత జీవితం ప్రైవేట్‌గా ఉండాలని చెప్పాడు. ఒకరి మీద నిందలు మోపడాన్ని తాను ఏ మాత్రం సహించబోనని అన్నాడు విరాట్ కోహ్లీ
ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె పుట్టింది. ఆమెకు వామిక అనే పేరు పెట్టారు