అనిమల్ సెకండ్ హీరోయిన్ కు భారీ పాపులారిటీ!!

రణబీర్ కపూర్-రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించిన 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది
ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటేసింది
ఈ సినిమాలో రష్మిక మెయిన్ లీడ్ గా నటించగా.. త్రిప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. త్రిప్తి డిమ్రికి భారీ పాపులారిటీ దక్కడంతో సోషల్ మీడియాలో ఆమె గురించి తెగ చర్చించేస్తున్నారు తెలుగు యువత.
తృప్తి డిమ్రి మత్తెక్కించే కండ్లతో, మెస్మరైజింగ్ స్కిన్‌ టోన్‌తో ఆకట్టుకుంటూ ఉంది.
ఆమె ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిప్తి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకటి చిత్రీకరణ దశలో ఉండగా.. మరొకటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.
యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక, తన పాత్రకి ఒక రేంజ్ లో వస్తుండడంతో త్రిప్తి స్పందించింది. రణబీర్ తో నా కెమిస్ట్రీ ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మళ్ళీ రణబీర్ తో నటిస్తానని తెలిపింది
త్రిప్తి ఉత్తరాఖండ్ లో పుట్టి పెరిగింది. ముంబైకి వచ్చి కొంతకాలం మోడల్ గా పనిచేస్తుంది. ఆమె అనేక యాడ్స్ లో కనిపించింది. ముఖ్యంగా సంతూర్ మమ్మీగా మంచి పాపులారిటీ దక్కించుకుంది.
2017 లో పోస్టర్ బాయ్స్ అనే హిందీ చిత్రంతో కథానాయకగా పరిచయమైంది. 2018 లో లైలా మజ్ను చిత్రంలో కనిపించింది. 2020లో ఆమె హీరోయిన్ గా నటించిన బుల్ బుల్ అనే హర్రర్ మూవీ త్రిప్తికి పాపులారిటీ దక్కింది
ఇక అనిమల్ సినిమా చేయడం ఆమె కెరీర్ కు భారీ ప్లస్ గా నిలిచింది