మెట్ గాలా 2024లో అలియా భట్ మెరుపులు

అలియా భట్ ఇటీవల మెట్ గాలా 2024లో అద్భుతమైన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి ఆమె ఫ్లోరల్ చీరను ధరించింది
ఆమె కార్పెట్‌పై నడుస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. ఆమె ఎంతో క్యూట్ గా కనిపించింది
అలియా ఈవెంట్ కు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె దుస్తులను తీర్చిదిద్దిన తన బృందానికి కృతజ్ఞతలు తెలిపింది
మెట్ గాలా 2024లో కార్పెట్‌పై నడవడానికి ముందు వోగ్‌తో మాట్లాడిన అలియా భట్.. ఈ ఈవెంట్ లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని తెలిపింది. నెలల పాటు ప్రిపరేషన్ జరిగిందని.. ఇది చాలా ప్రత్యేకమైనదని అలియా చెప్పుకొచ్చింది
తన దుస్తుల గురించి మాట్లాడుతూ.. ఈ సృష్టి వెనుక డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఉన్నారని అలియా తెలిపింది. మెట్ గాలాలో తాను రెండోసారి కనిపించగా, తొలిసారిగా ఈ కార్యక్రమంలో చీర కట్టుకున్నానని ఆమె తెలిపింది
అలియా భట్ తన చీరపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ గురించి మాట్లాడారు. ఈ చీర మీద వర్క్ కోసం 1900 కంటే ఎక్కువ గంటలు పని చేశారు. 163 మంది కళాకారులు ఈ సృష్టి వెనుక ఉందని అలియా వెల్లడించింది
అలియా భట్ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ ది స్టోన్' సినిమాలో నటించి మంచి పాపులారిటీని అందుకుంది