టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు నాగార్జున

లెజెండ్ కొడుకులా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. స్టార్ హీరోగా నిలదొక్కుకోగలిగారు.
ఎన్నో జానర్లకు సంబంధించిన సినిమాలు చేశారు నాగార్జున.. రొమాంటిక్, భక్తి, యాక్షన్, ఫ్యామిలీ సినిమాలతో ఆకట్టుకోగలిగారు
ఇక చాలామంది హీరోలకు దక్కని అదృష్టం.. 'మనం' మూవీతో నాగ్ సాధ్యం చేశాడు. తండ్రి కొడుకులతో కలిసి నటించిన నటుడిగా రికార్డ్ సృష్టించాడు
ఈ సినిమాలో తండ్రి ఏఎన్నార్, కొడుకులు నాగచైతన్య-అఖిల్ నటించారు. ఈ సినిమా తెలుగులో వచ్చిన బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం
మూడున్నర దశాబ్దాల సినిమా కెరీర్ లో ఇప్పటివరకూ 98 సినిమాలు చేసిన నాగార్జున, దాదాపు 42 మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు
ఆయన 99వ సినిమాతో 43వ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు
డైరెక్టర్స్ ని మాత్రమే కాదు నాగార్జున దాదాపు 100 మంది కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చాడు
నాగార్జున ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లిస్టులో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఫాజిల్, మహేష్ భట్, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, ఆర్ ఆర్ షిండే, దశరథ్, సూర్య కిరణ్, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు.
బుల్లితెరపై నాగ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు', బిగ్‌బాస్' లాంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ ను అందుకున్నారు