అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి తమన్నా యోగాలో పాల్గొంది

ఒక ఆశ్రమంలో ఆమె యోగా దినోత్సవంలో పాల్గొంది
పార్క్ లో ఇతర సన్నిహితులు, వృద్ధులతో కలిసి సరదాగా గడిపింది
ఈ ఫోటోలలో మేకప్‌ లేకుండా కనిపించింది తమన్నా
సద్గురు భోదనల ద్వారా, ఇషా ఫౌండేషన్‌ని సందర్శించినప్పుడు నేను యోగా కి సంబంధించిన నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించానని తెలిపింది తమన్నా
సింపుల్‌గా చెప్పాలంటే ఇది శరీరం యొక్క క్లిష్టమైన, వివరణాత్మక వినియోగదారు మాన్యువల్‌. మీరు ఆసనాలు దాటి చూస్తే, అది సరికొత్త ప్రపంచాన్ని తెరుస్తుందని చెప్పుకొచ్చింది
నేను అభ్యాసాలను తీసుకున్నా, నాలో దాగి ఉన్న సామర్థ్యాలను వినడానికి, అన్వేషించడానికి, అన్‌లాక్‌ చేయడానికి నాకు సహాయపడే జీవన విధానాన్ని యోగా ద్వారా సృష్టించుకున్నానంది
భవిష్యత్‌లో యోగ గొప్పతనాన్ని తెలుసుకోడానికి మనం ఒకరోజుని కేటాయించాల్సిన అవసరం లేదని నేను ఆశిస్తున్నా
తమన్నా నటిగా ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తోంది. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీతో `జైలర్‌`.. రెండు వెబ్‌ సిరీస్‌లలో తమన్నా కనిపించింది.