ప్రేమించి పెళ్లి చేసుకున్న బుల్లితెర 'పార్వతి'.. సోనారిక

'దేవో కే దేవ్‌' సీరియల్ లో పార్వతీ దేవి పాత్రతో మంచి గుర్తింపు పొందింది టీవీ నటి సోనారికా భడోరియా
ఫిబ్రవరి 18న వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను ఆమె వివాహం చేసుకుంది
రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఈ వివాహం జరిగింది. నూతన దంపతులు దండలు మార్చుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది
ఎనిమిదేళ్లుగా కలిసి ఉన్న సోనారిక, వికాస్ మే 2022లో మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరికి గోవాలో రోకా వేడుక కూడా జరిగింది. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది
వికాస్ స్వస్థలమైన హర్యానాలోని ఫరీదాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది
సోనారిక, వికాస్ జిమ్‌లో కలుసుకున్నారు. వారి రిలేషన్ షిప్ కాస్తా పెళ్లి దాకా సాగింది
వికాస్ నటనా రంగానికి చెందిన వ్యక్తి కాదని సోనారిక తెలిపింది. అతడు తనకు అండగా నిలబడ్డాడని పలు సందర్భాల్లో వికాస్ ను పొగుడుతూ సోనారిక తెలిపింది
సోనారిక తెలుగులో నాగ శౌర్యతో జాదూగాడు, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన స్పీడున్నోడు, ఈడోరకం-ఆడో రకం సినిమాల్లో నటించింది
టీవీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ను అందుకున్న సోనారిక, హీరోయిన్ గా అనుకున్నంత స్టార్డమ్ ను అందుకోలేకపోయింది