సోనా పెళ్లి అయిపోయింది!!

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కొన్నేళ్ల పాటూ తమ రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచుకున్న తర్వాత ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు
సోనాక్షి నివాసంలో వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సోనాక్షి, జహీర్ తమ పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు
ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ బాస్టియన్‌లో బాలీవుడ్‌ స్టార్స్ కు ప్రముఖులకు పార్టీని ఇచ్చారు. సోనాక్షి ఎరుపు రంగు చీర ధరించి సిందూర్ ధరించి తన భర్త జహీర్ ఇక్బాల్‌లో నడుస్తూ కనిపించింది
ఈ పార్టీకి సోనాక్షి తల్లిదండ్రులు శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా కూడా హాజరయ్యారు
ఈ పెళ్లి శత్రుఘ్న సిన్హాకు ఇష్టం లేదంటూ సాగిన ప్రచారానికి తెరదించుతూ.. శత్రుఘ్న సిన్హా వివాహ వేడుకకు హాజరయ్యారు
ఈ జంట జూన్ 23న కోర్టు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇచ్చిన పార్టీకి రేఖ, కాజోల్, టబు, హుమా ఖురేషి, అదితి రావ్ హైదరీ-సిద్ధార్థ్, సంజయ్ లీలా భన్సాలీ, సంజీదా షేక్, సైరా బాను, విద్యాబాలన్-సిద్ధార్థ్‌ తదితరులు హాజరయ్యారు
సోనాక్షి కస్టమ్ రెడ్ బనారసీ సిల్క్ బ్రోకేడ్ చీరను ధరించింది. డైమండ్ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని పెట్టుకుంది. ఎరుపు రంగు బ్యాంగిల్స్, సిందూర్‌ తో కనిపించింది
జహీర్ తెల్లని మెరిసే షేర్వానీలో కనిపించాడు. చిత్ర ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు