స్క్రిప్ట్ చదవకుండానే సినిమాకు ఓకె చెప్పేశానంటున్న రాశి ఖన్నా

తమన్నా భాటియా, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించిన సినిమా 'అరణ్మని-4'. తెలుగు లో ఈ హార్రర్ కామెడీ సినిమా 'బాక్' పేరుతో విడుదల అవుతోంది
ఈ చిత్రానికి సంబంధించి రాశి ఖన్నా స్క్రిప్ట్ చదవకుండానే సంతకం చేశానని వెల్లడించింది
అరణ్మని సిరీస్ లో భాగంగా వస్తున్న ఇది హారర్ కామెడీ, సస్పెన్స్ చిత్రం. ఈ చిత్రం 3 మే 2024న విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో 'బాక్' పేరుతో అదే రోజున విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన తమన్నా భాటియా, రాశి ఖన్నా కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో బాగా ముందున్నారు. పలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఈ ఇద్దరు భాగమయ్యారు
ఒక ఇంటర్వ్యూలో, రాశి ఖన్నా మాట్లాడుతూ.. దర్శకుడు సుందర్ సి తనని పిలిచినప్పుడు.. స్క్రిప్ట్ కూడా వినకుండా సినిమాకు ఓకే చెప్పానని తెలిపింది. తాను కేవలం ఈ ఫ్రాంఛైజీ భాగమవ్వాలని మాత్రమే కోరుకున్నానని రాశి ఖన్నా తెలిపింది
అవ్నీ సినిమాక్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు
'బాక్’ చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం.. మే3 న తప్పకుండా సినిమాని ఫ్యామిలీతో పాటు చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని హీరోయిన్ తమన్నా భాటియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది
విమన్ పవర్ ని సెలబ్రేట్ చేసే డైరెక్టర్ సుందర్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తరపు నుంచి ఖుష్బు గారు వుండటం చాలా ఆనందంగా వుందని తమన్నా భాటియా తెలిపింది
రాశిని బెంగాల్ టైగర్ నుంచి చూస్తున్నాను. తను చాలా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా అయ్యయో ప్రమోషనల్ సాంగ్ ని చేసినప్పుడు ఇద్దరం కలసి చాలా ఎంజాయ్ చేశామని తమన్నా తెలిపింది