డార్లింగ్ అంటున్న నభా.. స్పెషల్ ఏమిటంటే!!

టాలీవుడ్ లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది నభా నటేష్. ఆ సినిమాలో నభా నటేష్ అటు క్యూట్ గా ఇటు హాట్ గా కనిపించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది
మంచి హిట్స్ అందుకుంటున్న సమయంలో నభాకు ఊహించని విధంగా సినిమాలకు బ్రేక్ వచ్చింది
అయితే అమ్మడు బ్రేక్ తీసుకోడానికి కారణం ఏమిటా అని ఆమె అభిమానులు ఆరా తీయగా.. అందుకు కారణం యాక్సిడెంట్ అవ్వడమే
కరోనా లాక్ డౌన్ తర్వాత.. 2022లో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం బయటకు అసలు రాలేదు. ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది
ఆ ప్రమాదంలో నభా భుజం విరిగింది. పలు సర్జరీలు అవసరం అయ్యాయి. కొన్ని నెలలకు పైగా ఆమె కోలుకోడానికి సమయం పట్టింది
ఆమె చివరిగా నటించిన మ్యాస్ట్రో 2021 లో విడుదలైంది. నభా ఎప్పుడు తిరిగి వస్తుందా అని అభిమానులు ఎదురు చూశారు. ఆమె ఇప్పుడు అభిమానులను ఆకట్టుకోడానికి సిద్ధంగా ఉంది
నభా చేతిలో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో ఒకటి స్వయంభు.. మరొకటి 'డార్లింగ్'
ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నభా నటేష్ నటిస్తోంది. ప్రియదర్శి హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా మంచి ఫన్ తో నిండిన సినిమా అని చిత్ర యూనిట్ చెబుతోంది
సినిమా ప్రమోషన్స్ లో నభా నటేష్ ఫుల్ బిజీగా ఉంది. అందులో భాగంగా పలు ఫోటో షూట్ లలో మెరుస్తూ ఉంది