మాళవిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో.. ఆమె చేసుకోబోయేది ఎవరో తెలుసుకోవాలనుకున్నారు కొందరు. దానికి ఆమె, “నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు?” అని కొంటెగా సమాధానం ఇచ్చింది

ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చిన మాళవిక మోహనన్
నటి మాళవిక మోహనన్ తన X (ట్విట్టర్) ఖాతాలో అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ ను నిర్వహించారు. ఆమెపై అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలకు, ట్రోల్‌లకు కొన్ని సముచితమైన, కొన్నిసార్లు చమత్కారమైన సమాధానాలు ఇచ్చింది
2024లో మొదటి నాలుగు నెలలు ఎలా గడిచాయని ఒక అభిమాని ఆమెను అడిగాడు. దానికి ఆమె పర్వాలేదు అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే త్వరలో మరింత బాగవుతుందని ఆశిస్తున్నానని తెలిపింది
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమాలో పని చేయడాన్ని చాలా ఇష్టపడుతున్నా అని మాళవిక చెప్పుకొచ్చింది. త్వరలో ఒక మంచి ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నానని తెలిపింది మాళవిక
ఒక నెటిజన్ మాళవికను "మీరు గ్లామర్ షోలకు బదులుగా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు?" అని అడగ్గా.. సంకోచం లేకుండా, మాళవిక "ఎప్పుడూ కాదు.. నీకు ఏమైనా సమస్య ఉందా" అని సమాధానం చెప్పింది
మాళవిక మోహనన్ 'తంగళాన్' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె విక్రమ్‌తో కలిసి నటించింది
పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గని కార్మికుల జీవితానికి సంబంధించినదని ప్రచారం జరుగుతూ ఉంది
మలయాళ చిత్ర పరిశ్రమలో, మాళవిక మోహనన్ చివరిసారిగా రొమాంటిక్ చిత్రం 'క్రిస్టీ'లో కనిపించింది. ఈ సినిమా దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది
తెలుగులో కూడా మాళవిక ఓ సినిమా చేస్తోందని ప్రచారం సాగుతూ ఉంది. ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాలో కీలక పాత్రలో మాళవిక నటిస్తూ ఉంది. ఆ సినిమా మాళవిక కెరీర్ కు ప్లస్ అవుతుందని ఆశిస్తూ ఉంది