ఫ్రెండ్ పెళ్లిలో మురిసిపోయిన-మెరిసిపోయిన కీర్తి సురేష్

దక్షిణాది నటి కీర్తి సురేష్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి
అమ్మడు తన స్నేహితురాలి పెళ్లిలో తోడిపెళ్లికూతురుగా కనిపించింది. పింక్ సిల్క్ చీరలో మెరిసిపోయింది
కీర్తి సురేష్ ఇటీవల స్నేహితురాలి పెళ్లిలో తోడిపెళ్లికూతురుగా కనిపించింది. పింక్ సిల్క్ చీరలో.. స్లీవ్‌లెస్ బ్లౌజ్.. నెక్లెస్.. జుమ్కాలు ధరించి తళుక్కుమంది
అభిమానులు కీర్తి సురేష్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. 'నీ ఫ్రెండ్ పెళ్లి కాబట్టి సరిపోయింది.. అదే నీ పెళ్లి అయితే మేము ఏమైపోతామో' అంటూ కీర్తి సురేష్ ను కీర్తిస్తూ ఉన్నారు
కీర్తి సురేష్ ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి' సినిమాలో భాగంగా ఉంది. అమ్మడు 'బుజ్జి' అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గా ఉంటూ భైరవకు తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది
ఇప్పటికే 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వగా.. సినిమాలో ఇద్దరూ కలిసి ఇంకెంత సందడి చేస్తారోనని అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు
మ‌హాన‌టితో సూప‌ర్ క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాలకు కూడా ప్రస్తుతం ఓకె చెబుతోంది
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి, దాంతో పాటూ మ‌రో రెండు సినిమాలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రఘు తాత సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాబోతోంది