ఇంటర్నెట్ ను ఊపేస్తున్న అంజలి హాట్ లుక్స్

తెలుగమ్మాయి అంజలికి తెలుగులో కంటే తమిళంలోనే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తమిళంలో పలువురు స్టార్స్ తో చేసింది
అప్పుడప్పుడు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ వచ్చింది
అంజలి నటించిన హారర్‌ సినిమా ‘గీతాంజలి’కి కొనసాగింపుగా వస్తున్న సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్‌ నిర్మాత. మార్చి 22న ఈ సినిమా విడుదల కానుంది
ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకులు మలినేని గోపీచంద్‌, బాబీ, బుచ్చిబాబు సాన, హీరో శ్రీవిష్ణు అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు
గీతాంజలి-2 అంజలికి 50వ సినిమా. గీతాంజలి మళ్లీ వచ్చింది.. మరింత ఎక్కువగా నవ్విస్తుంది. భయపెడుతుంది. థియేటర్లో మంచి అనుభూతిని పొందుతారని అంజలి తెలిపింది
50 సినిమాలు అనేది స్పెషల్ నంబర్. నాకెంతో ఆనందంగా ఉంది. కోన గారు ఈ సినిమాకు చాలా ప్రత్యేకం. పదేళ్ల తరువాత కూడా ఈ సినిమాను తీయగలిగాం అంటే.. అది ఆయన వల్లేనని అంజలి వివరించింది
నిశ్శబ్దం టైంలోనే ఈ మూవీ పాయింట్ చెప్పారు. కానీ కథను రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ షూటింగ్‌ను మాత్రం చాలా వేగంగా పూర్తి చేశామని అంజలి చెప్పుకొచ్చింది
ఇక ఈవెంట్ కు రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చిన అంజలి ఫోటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి