ఇంతకూ ఏంటా ఆవేశం సినిమా కథ.. బాలయ్య రీమేక్ లో నటించబోతున్నారా?
ఫహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం 'ఆవేశం' సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయింది
ఈ చిత్రం ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 'ఆవేశం' సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది
ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో డబ్ అయింది కానీ.. తెలుగులో అందుబాటులో లేదు
ఈ సినిమాను టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ రీమేక్ చేసే అవకాశం ఉందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది
ఇప్పటికే బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం
ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా 'ఆవేశం' రీమేక్ అంటూ చెబుతున్నారు. హరీష్ శంకర్ పలు సినిమాల రీమేక్ లను అద్భుతంగా తెలుగులో తీశారు
గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్ సినిమాలను ఎంత సూపర్బ్ గా రీమేక్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15న విడుదలకాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా హిందీ 'రైడ్' సినిమా రీమేక్
ఆవేశం సినిమా కథకు వస్తే.. రంగ అనే వ్యక్తి బెంగళూరులో ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులు బెంగళూరులో చదువుకోడానికి వస్తారు
సీనియర్ల ర్యాగింగ్ నుండి తప్పించుకోడానికి రంగతో స్నేహం చేస్తారు. ఏకాకిగా బతుకుతున్నా అనే బాధలో ఎప్పుడూ ఉండే రంగ.. ఈ ముగ్గురిని సొంత తమ్ముళ్లలా భావిస్తాడు
అయితే చదువుకునే పిల్లలకు రంగ కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తాయన్నదే మిగిలిన కథ. అలాంటి క్యారెక్టర్ బాలయ్య బాబు చేస్తే మాత్రం సూపర్బ్ గా ఉంటుంది. అయితే ఈ రీమేక్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది