అందరూ చూడాలి
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం [more]
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం [more]
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఏపీలోని 62 వేల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.