Tue Aug 09 2022 23:59:36 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : కేరళను తాకిన మరో వైరస్

కేరళలో మరో వైరస్ కలకలం రేపుతుంది. దీనిని నోరో వైరస్ గా ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం వయనాడ్ జిల్లాలోని పూకోడ్ వెటర్నరీ కళాశాలలో పదమూడు మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిని పరీక్ష చేసిన వైద్యులు నోరో వైరస్ గా గుర్తించడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఇవే లక్షణాలు….
నోరో వైరస్ సోకడం వల్ల వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
Next Story