సమస్య పరిష్కరించుకున్న వైసీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ సమస్య పరిష్కారమైంది. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ సమస్య పరిష్కారమైంది. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ సమస్య పరిష్కారమైంది. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినందున శివకుమార్ ను వైసీపీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన తన సస్పెన్షన్ చెల్లదని, వైసీపీని తానే స్థాపించానని ఆందోళనలు చేశారు. ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఇవాళ జగన్ తో భేటీ అయ్యారు. మూడు నెలలుగా కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరమయ్యానని, అయినా జగన్ పెద్ద మనస్సు చేసుకొని తిరిగి పార్టీలోకి స్వాగతించారని పేర్కొన్నారు. ఇక నుంచి పార్టీలో పని చెస్తానన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇబ్బందిగా మారుతుందనుకున్న శివకుమార్ వివాదం చల్లారినట్లే ఉంది.