Wed Feb 19 2025 21:46:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఇసుక కొరతపై జగన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు జరపాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్లనే ఇసుక [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు జరపాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్లనే ఇసుక [more]

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు జరపాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్లనే ఇసుక తవ్వకాలు జరపలేకపోతున్నామని చెప్పిన జగన్, టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమేనని కొట్టిపారేశారు. ఈ వారోత్సవాల తర్వాత ఇసుక గురించి రాష్ట్రంలో ఎవరూ చర్చించకుండా చేయాలని కోరారు. కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారంరోజుల పాటు అధికారులు ఇసుకపైనే పనిచేయాలని అధికారులకు పిలుపు నిచ్చారు. ఇసుక సరఫరా పై ఎలాంటి ఆరోపణలు రాకూడదని జగన్ అధికారులను హెచ్చరించారు.
Next Story