బాబుకు ఇంగ్లీష్ రాదా? అర్ధం కాదా?
జీవో 2430ను రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మీడియాపై ఆంక్షలపై టీడీపీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. [more]
జీవో 2430ను రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మీడియాపై ఆంక్షలపై టీడీపీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. [more]

జీవో 2430ను రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మీడియాపై ఆంక్షలపై టీడీపీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీఫ్ మార్షల్ తమ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కోరింది. మీడియా గొంతునొక్కుతున్నారని టీడీపీ ఆరోపించింది. దీనికి వైఎస్ జగన్ సమాధానమిస్తూ జీవో 2430లో ఎటువంటి తప్పులేదన్నారు. అవాస్తవ వార్తలను ప్రచురిస్తేనే చర్యలుంటాయని చెప్పారు. చంద్రబాబు జీవోలో ఉన్న ఇంగ్లీష్ ను అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. అన్యాయంగా అవాస్తవ వార్తలు రాస్తే ప్రభుత్వం మౌనంగా ఉండాల్సిందేనా? అని జగన్ ప్రశ్నించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాస్తేనే చర్యలు ఉంటాయని ఆ జీవోలో ఉందని చెప్పారు. ఇంగ్లీష్ రాకపోతేనో, అర్థం చేసుకోకపోతేనో ఈ జీవోను ఎవరైనా తప్పుపడతారన్నారు. నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదన్నారు.
తనను కించపరుస్తున్నారు…..
తనకు ఇంగ్లీష్ రాదని పదే పదే చెబుతున్నారని, తాను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశానని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ చదివారో చెబితే తాను కూడా నేర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు. దేశంలోని అందరూ ఈ జీవోను ఖండిస్తున్నారని, వారికి ఇంగ్లీష్ రాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవోను వెనక్కు తీసుకున్నారన్నారు. తాను కాగితాలు పట్టుకుని వచ్చినా చీఫ్ మార్షల్ తనను తోసి వేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్సీల పట్ల అసభ్కకరంగా ప్రవర్తించారన్నారు చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టి పులివెందుల పంచాయతీ పెడితే ఇక్కడ కుదరదన్నారు. తమపై దాడిచేసిన మార్షల్ ను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆరోజు జగన్ అసెంబ్లీలో ఆందోళనకు దిగింది ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందుకేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు.