బ్రేకింగ్ : వాటిని రద్దు చేసిన జగన్
వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో రెండు వైద్యసంస్థలకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. [more]
వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో రెండు వైద్యసంస్థలకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. [more]

వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో రెండు వైద్యసంస్థలకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. చంద్రబాబు హయంలో రాజధాని అమరావతిలో రెండు వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. బీఆర్ శెట్టి, ఇండోయూకే సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేశారు. మూడేళ్లయినా ఈ సంస్థలు పనులు ప్రారంభించకపోవడంతో జగన్ సర్కార్ రద్దు చేసింది. బీఆర్ శెట్టికి వంద ఎకరాలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఇండోయూకే సంస్థకు యాభై ఎకరాలు తొలిదశలో కేటాయించింది. ఈ రెండు సంస్థలు ప్రభుత్వానికి అప్పట్లో 75 కోట్లు చెల్లించాయి. అయితే పనులు ప్రారంభించకపోవడంతో రెండు సంస్థలకు ఇచ్చిన భూముల ఉత్తర్వులను రద్దు చేశారు.