Tue Jun 06 2023 19:14:07 GMT+0000 (Coordinated Universal Time)
మరో కొత్త పథకానికి జగన్ గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం
ఈబీసీ లకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమయింది. ఈ పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఒక్కొక్క [more]
ఈబీసీ లకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమయింది. ఈ పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఒక్కొక్క [more]

ఈబీసీ లకు చెందిన మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్దమయింది. ఈ పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఒక్కొక్క మహిళకు అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు ఈపథకానికి అర్హులు. దీనికి మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాజధాని అమరావతి పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు మూడు వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇస్తూ ఏంఆర్డీఏకు అనుమతిస్తూ మంత్రి వర్గం అంగీకారం తెలిపింది. కాకినాడ ఎస్ఈజడ్ లో రైతులకు నష్టపరిహారాన్ని కమిటీ సూచించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
Next Story