మూడేళ్లలోనే పూర్తి చేస్తాం
ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అది మోసమవుతుందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాయి వేస్తే అది చిత్తశుద్ధి అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ [more]
ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అది మోసమవుతుందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాయి వేస్తే అది చిత్తశుద్ధి అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ [more]

ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అది మోసమవుతుందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాయి వేస్తే అది చిత్తశుద్ధి అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. మూడేళ్లలోనే ఈ స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన ఐరన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నామని జగన్ వివరించారు. 30 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన ఉక్కు ఫ్యాక్టరీ వల్ల వేలాది మందికి ఉపాధి దొరకుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కడప జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిందన్నారు. పదిహేను వేల కోట్లతో ఈ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన హామీ అయిన స్టీల్ ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వమ ముందుకు వచ్చి నిర్మించాలని తలపెట్టిందన్నారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం జరుగుతుందన్నారు. రాయలసీమ మొత్తానికి మేలు జరుగుతుందని జగన్ అన్నారు.