Sun Jul 03 2022 09:44:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆర్కేకు షాకిచ్చిన జగన్..?

గంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ మొండిచేయి చూపుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి స్థానాన్ని వైసీపీ బీసీ అభ్యర్థికి కేటాయించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక్కడి నుంచి ఉడుతా శ్రీను అనే బీసీ వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని వైసీపీ యోచిస్తుంది. ఉడుతా శ్రీను టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కోసం బాగా కష్టపడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేయనని మొదట చెప్పారు. తర్వాత మళ్లీ పోటీ చేసేందుకు అంగీకరించారు. అయితే, ఆళ్లకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఉండటంతో ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి పార్టీకి నిబద్ధతగా ఉన్న ఆయనకు జగన్ ఏ విధంగా న్యాయం చేస్తోరో చూడాలి.
Next Story