అచ్చెన్నాయుడికి ప్రివిలేజీ నోటీసు
టీడీపీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిపై ప్రివిలైజ్ నోటీసు ఇస్తున్నానని జగన్ శాసనసభలో తెలిపారు. మద్యం విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఏపీలో నాటుసారా వినియోగం పెరిగిందని, మద్యం దుకాణాలు [more]
టీడీపీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిపై ప్రివిలైజ్ నోటీసు ఇస్తున్నానని జగన్ శాసనసభలో తెలిపారు. మద్యం విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఏపీలో నాటుసారా వినియోగం పెరిగిందని, మద్యం దుకాణాలు [more]

టీడీపీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిపై ప్రివిలైజ్ నోటీసు ఇస్తున్నానని జగన్ శాసనసభలో తెలిపారు. మద్యం విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఏపీలో నాటుసారా వినియోగం పెరిగిందని, మద్యం దుకాణాలు తగ్గినా బెల్ట్ షాపుల సంఖ్య పెరిగిందని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనికి జగన్ సమాధానమిస్తూ మూడు దశల్లో తాము మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించామన్నారు. టీడీపీ లెక్కలు తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 25 శాతం మద్యం షాపులు తగ్గించామని చెప్పారు. ఇప్పుడు కేవలం ఏపీలో 3456 మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయన్నారు జగన్. తప్పుడు సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడిపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తున్నానని జగన్ అన్నారు.