బాబూ….డ్రామాలాపు…!!!
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. చంద్రబాబునాయుడికి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కాని డ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదని [more]
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. చంద్రబాబునాయుడికి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కాని డ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదని [more]

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు. చంద్రబాబునాయుడికి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కాని డ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. తనను ఓదార్చేందుకు రోజుకు చంద్రబాబు 300 మందిని తన ఇంటికి పిలుచుకుంటున్నారని, వారేమో చంద్రబాబును తమ ఇంట్లో ఉండాలని ఆహ్వానిస్తున్నారని, ఇది పెద్ద డ్రామాగా విజయసాయి రెడ్డి అభివర్ణించారు. వచ్చిన వారంతా రిహార్సల్స్ చేసి వస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు దేశంలోని రాజకీయనేతల్లో కెల్లా అత్యంత ధనవంతుడని ఆయన ట్వీట్ చేశారు. ఈ డ్రామాలు రక్తి కట్టవు బాబూ అని విజయసాయి రెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.