Fri Jun 02 2023 08:16:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడా ఏకగ్రీవాలుంటాయ్
కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. విశాఖలోని 14, 34, 25, 26 డివిజన్ [more]
కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. విశాఖలోని 14, 34, 25, 26 డివిజన్ [more]

కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. విశాఖలోని 14, 34, 25, 26 డివిజన్ లలో టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలన చూసి టీడీపీ నేతలే వైసీపీ లోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారన్నారు. రోజురోజుకూ జగన్ కు ప్రజాదరణ పెరుగుతుండటంతో వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. టీడీపీ ఖాళీ అవ్వక తప్పదని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.
Next Story