Thu Dec 05 2024 15:48:09 GMT+0000 (Coordinated Universal Time)
బాబే అన్నింటికీ కారణం
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 2018 అక్టోబరు 22వ తేదీన కొరియా రాయబారి [more]
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 2018 అక్టోబరు 22వ తేదీన కొరియా రాయబారి [more]
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 2018 అక్టోబరు 22వ తేదీన కొరియా రాయబారి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారన్నారు. కానీ ఇప్పుడు తనకేమీ తెలియనట్లు చంద్రబాబు నటిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. పోస్కో ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన విషయాన్ని చంద్రబాబు ఎందుకు దాచి పెట్టారని విజయసాయిరెడ్డి ప్రశ్నంచారు. ఇప్పడు వైసీపీ ప్రభుత్వంపై తప్పును రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తాము అడ్డుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story