Mon Aug 15 2022 03:53:05 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు కంగారెందుకు..?

ప్రజల డేటాను దుర్వినియోగం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని బయటకు ఇవ్వడం నేరమని, ఈ అంశంలో వైసీపీ ఫిర్యాదు చేయడంలో ఎటువంటి తప్పూ లేదన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరగాలన్నారు. డేటా చోరీ వ్యవహారం ఎన్నికలపై ప్రభావం చూపదని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలని, తాము వస్తే ఏం చేస్తామో ప్రతిపక్షం చెప్పుకోని ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరుగనున్నాయని, డబ్బులు ఖర్చు చేసే అభ్యర్థుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story