Sat Aug 13 2022 05:59:13 GMT+0000 (Coordinated Universal Time)
అది బాగా లేదు.. మాకు అవకాశమివ్వండి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్ తయారీకి అనుమతివ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కోవిన్ యాప్ లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్ధవ్ థాక్రే తన లేఖలో తెలిపారు. తమ ప్రభుత్వమే సొంతంగా యాప్ తయారు చేసుకుని, దాని ద్వారా మహారాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు.
Next Story