Sat Aug 13 2022 06:30:37 GMT+0000 (Coordinated Universal Time)
మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు
మహరాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో మరో మంత్రి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అనిల్ పరబ్ మంత్రిగా వసూళ్ల దందా చేశారని సచిన్ వాజే చెప్పారు. ఈ మేరకు సచిన్ వాజే ఎన్ఐఏకు లేఖ రాశారు. మొన్న హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోపణలు రావడం, ఆయనపై సీబీఐ విచారణ చేయమని కోర్టు ఆదేశించడంతో రాజీనామా చేశారు. ఇప్పుడు మరో మంత్రి అనిల్ పరబ్ పై కూడా అవినీతి ఆరోపణలు రావడం విశేషం.
Next Story