క్లినికల్ ట్రయల్స్ పై మొదలైన విచారణ
నీలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది . దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ [more]
నీలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది . దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ [more]

నీలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది . దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ ఇవాళ నీలోఫర్ ఆసుపత్రిలో పర్యటించింది. ఎంత మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారన్న కోణంలో విచారణ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది. నిలోఫర్ హాస్పిటల్ త్రిసభ్య కమిటీ లో డాక్టర్ రాజారావ్ , డాక్టర్ నిర్మల థామస్ , డాక్టర్ లక్ష్మి కామేశ్వరి తో పాటు విచారణలో పాల్గొన్న నిలోఫర్ ఆసుపత్రి సూపరిండెంట్ మురళి కృష్ణ ఉన్నారు. క్లినికల్ ట్రైల్స్ లో ఎంత మంది మీద చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి పై కూడా విచారణ చేసి వివరాలు సేకరించింది కమిటీ. తాము సేకరించిన పూర్తి వివరాలు ప్రభుతానికి అందజేస్తామన్నారు. ఈ క్లినికిల్ ట్రైల్స్ లో పాల్గొన్న ఫార్మా కంపెనీల వివరాలు సేకరించి వారి వివరాలు కూడా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు త్రిసభ్య కమిటీ సభ్యులు.