టీజీ సరికొత్త ప్రతిపాదన
అమరావతి ఫ్రీజోన్ గా ఆరోజు పెట్టి ఉంటే ఈరోజు ఇలాంటి నిర్ణయం కానీ, ఆందోళనలు కాని జరిగేవి కావని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. [more]
అమరావతి ఫ్రీజోన్ గా ఆరోజు పెట్టి ఉంటే ఈరోజు ఇలాంటి నిర్ణయం కానీ, ఆందోళనలు కాని జరిగేవి కావని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. [more]

అమరావతి ఫ్రీజోన్ గా ఆరోజు పెట్టి ఉంటే ఈరోజు ఇలాంటి నిర్ణయం కానీ, ఆందోళనలు కాని జరిగేవి కావని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో మినీ సెక్రటేరియట్ లు మూడు ప్రాంతాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు బెంచ్ ల మాదిరిగానే మినీ సెక్రటేరియట్ లను అమరావతి, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అమరావతిలోనే రాజధాని ఉంచాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం సరికాదన్నారు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటుకు అడ్డుపడటం సరికాదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే మూడు ప్రాంతాలు కలిసి ఉంటాయని, లేకుంటే ఉద్యమాలు రావచ్చని టీజీ వెంకటేశ్ అన్నారు. చంద్రబాబు అమరావతి ఫ్రీజోన్ చేయక పోవడం వల్లనే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉద్యమాలు తలెత్తాయని అన్నారు. అమరావతిలో ఉన్న తాత్కాలిక భవనాలేనని చంద్రబాబు చెప్పారన్నారు. అమరావతి రైతుల సమస్యలను మాత్రం పరిష్కరించాలని టీజీ వెంకటేశ్ కోరారు.