కేసీఆర్ ను కంట్రోల్ చేసేందుకేనా?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులయ్యారు. బీజేపీ అధిష్టానం సౌందరరాజన్ ను ఏరికోరి తెలంగాణకు పంపించడం వెనక వ్యూహం దాగి [more]
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులయ్యారు. బీజేపీ అధిష్టానం సౌందరరాజన్ ను ఏరికోరి తెలంగాణకు పంపించడం వెనక వ్యూహం దాగి [more]

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులయ్యారు. బీజేపీ అధిష్టానం సౌందరరాజన్ ను ఏరికోరి తెలంగాణకు పంపించడం వెనక వ్యూహం దాగి ఉందంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతున్న తరుణంలో నరసింహన్ అయితే కష్టమేనని బీజేపీ అధిష్టానం భావించింది. నరసింహన్, కేసీఆర్ లమధ్య సత్సంబంధాలున్నాయి. నరసింహన్ అనేకసార్లు కేసీఆర్ ను వెనకేసుకొచ్చారు.
కరడు గట్టిన…..
ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నేతలు కూడా గత కొద్దికాలంగా నరసింహన్ ను మార్చాలని పట్టుబడుతున్నారు. తమిళసై సౌందర్ రాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. కరడుగట్టిన బీజేపీ వాది. తమిళనాడులో అనేకసార్లు సౌందర్ రాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. దీంతో సౌందర్ రాజన్ అయితేనే కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టవవచ్చన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.