Sun Jul 03 2022 08:01:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మోదీ సర్కార్ కి ఎదురుదెబ్బ

సీబీఐ వివాదంలో మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలోక్ వర్మను అక్టోబరు 23న కేంద్రం సెలవుపై పంపించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన స్థానంలో నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో మళ్లీ అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన పదవీకాలం జనవరి 31న ముగుస్తుండటం గమనార్హం.
Next Story