ఏపీ ఇంటలిజెన్స్ ఓఎస్డీగా
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖ లో కొత్త పొస్టును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లో రిటైర్డు అయిన శశిధర్ రెడ్డిని ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ [more]
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖ లో కొత్త పొస్టును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లో రిటైర్డు అయిన శశిధర్ రెడ్డిని ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ [more]

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖ లో కొత్త పొస్టును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లో రిటైర్డు అయిన శశిధర్ రెడ్డిని ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రమణ్యం ఆదేశాలు చేశారు. తెలంగాణ పోలీసు అకాడమిలో ఐజి గా రిటైర్టు అయిన శశిధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ శాఖ లో ఓఎస్డీగా నియమించింది. తెలంగాణతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలకమైన బాధ్యతలను శశిధర్ రెడ్డి నిర్వహించారు. రెండేళ్ల కాలపరిమితికి ఓఎస్డీ గా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెండు లక్షల పై చిలుకు జీతం చెల్లించనున్నరాు. శశిధర్ రెడ్డి డిజిపి కి రిపొర్టు చేయవలసి వుంటుంది.
స్టీఫెన్ రవీంద్ర రాకపోవడంతో…..
ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసిన అనుభవం శశిధర్ రెడ్డికి వుంది. తెలంగాణ ఐజీ స్టీపెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీప్ గా నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. స్టీపెన్ రవీంద్ర ను ఆంధ్రాకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ఇవ్వవలసి వుంటుంది. ఇంటర్ స్టేట్ బదిలీ కొరుతూ స్టీపెన్ రవీంద్ర పెట్టుకున్న ధరఖాస్తు పైన కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో స్టీపెన్ రవీంద్ర తిరిగి వచ్చి తెలంగాణలో డ్యూటి చేసుకుంటున్నారు. స్టీఫెన్ రవీంద్ర నియమకంగా దాదాపుగా లేనట్టే అయ్యింది. దీంతో ఇన్నాళ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖాళీగా పెట్టింది. ఇంటెలిజెన్స్ కు ఎవరు ఉన్నత స్దానంలో అధికారులు లేక పోవడం మంచిది కాదని భావించిన ప్రభుత్వం రిటైర్డు ఐజి శశధర్ రెడ్డిని ఓఎస్ డి గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.