వైసీపీ సర్కార్ మరో ఎంక్వైరీ
సదావర్తి భూములపై విచారణకు ఆదేశిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శాసనసభలో చెప్పారు. సదావర్తి భూములు దాదాపు 16వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయని, అయితే [more]
సదావర్తి భూములపై విచారణకు ఆదేశిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శాసనసభలో చెప్పారు. సదావర్తి భూములు దాదాపు 16వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయని, అయితే [more]

సదావర్తి భూములపై విచారణకు ఆదేశిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శాసనసభలో చెప్పారు. సదావర్తి భూములు దాదాపు 16వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయని, అయితే అతి తక్కువ సొమ్ముకు తన అనుచరులకు చంద్రబాబునాయుడు కట్టబెట్టాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారని వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు. సదావర్తి భూములు ఏపీకి చెందినవేనని గతంలో తమిళనాడుకు చెందిన డిప్యూటీ కలెక్టర్ అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖరాసిన విషయాన్ని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. దీనికి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సదావర్తి భూముల విషయం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, వైసీపీ నేతలు ఆ భూములు విక్రయించకుండా అడ్డుకుని అనవసర వివాదం సృష్టించారని చెప్పారు. సదావర్తి భూములపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు చంద్రబాబునాయుడు.