సమ్మె విరమణ మరోసారి
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మరో సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరు [more]
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మరో సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరు [more]

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మరో సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరు కావాలని అశ్వద్ధామరెడ్డి సూచించారు. కార్మికులంతా విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ ఓడిపోలేదని, ప్రభుత్వం గెలవలేదని అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మె నైతికంగా విజయవంతమైందని చెప్పారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని అన్నారు.