చలో ట్యాంక్ బండ్ కు పిలుపు
ఈనెల 9వ తేదీన చలోట్యాంక్ బండ్ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంతో వారంరోజుల పాటు కార్యక్రమాలను జేఏసీ [more]
ఈనెల 9వ తేదీన చలోట్యాంక్ బండ్ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంతో వారంరోజుల పాటు కార్యక్రమాలను జేఏసీ [more]

ఈనెల 9వ తేదీన చలోట్యాంక్ బండ్ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంతో వారంరోజుల పాటు కార్యక్రమాలను జేఏసీ రూపొందించింది. రేపు అమరుల కోసం పల్లెబాట పట్టనున్నారు. నాల్గో తేదీన రాజకీయ పార్టీల తో కలసి డిపోల వద్ద నిరాహార దీక్షలు చేపడతారు. ఐదో తేదీన రహదారులను నిర్భంధిస్తారు. ఆరో తేదీన డిపోల ఎదుట జేఏసీ దీక్షలు చేయనుంది. ఏడో తేదీన కుటుంబాలతో కలసి కార్మికులు డీపోల ఎదుట దీక్షలు చేస్తారు. ఎనిమిదో తేదీన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక కార్యక్రమాలు చేస్తారు. 9వ తేదీన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం చేపడతారు.