Thu Feb 02 2023 02:13:56 GMT+0000 (Coordinated Universal Time)
అమరరాజాది రాజకీయ సమస్య కాదు
చంద్రబాబుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరరాజా కంపెనీది రాజకీయ సమస్య కాదని, కాలుష్యం సమస్య అని రోజా [more]
చంద్రబాబుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరరాజా కంపెనీది రాజకీయ సమస్య కాదని, కాలుష్యం సమస్య అని రోజా [more]

చంద్రబాబుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అమరరాజా కంపెనీది రాజకీయ సమస్య కాదని, కాలుష్యం సమస్య అని రోజా అన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరరాజా కంపెనీ విడుదల చేసిన కాలుష్యంపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. అమరరాజా తో పాటు రాష్ట్రంలో 54 కంపెనీలకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరరాజా కంపెనీ అనేక మంది ప్రాణాలతో చెలగాటమాడుతుందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను పాటిస్తే కంపెనీని ఇక్కడే నిర్వహించుకోవచ్చని రోజా సలహా ఇచ్చారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story