దిశ కేసులో త్వరలోనే?
దిశ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా షాద్ నగర్ లోని ఫాస్ట్ ట్రాక్ [more]
దిశ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా షాద్ నగర్ లోని ఫాస్ట్ ట్రాక్ [more]

దిశ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా షాద్ నగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్ ను, పోస్టుమార్టం నివేదికను పోలీసులు తెప్పించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారిన సీసీ టీవీ పుటేజ్ ని కూడా అధికారులు సేకరించారు. మరోవైపు అత్యాచారం ,హత్య చేసిన ఘటన ప్రాంతంలో దొరికిన ఆధారాలను సేకరించి నివేదికను సిద్ధం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలో దిశకు మద్యం తాగించి అత్యాచారం చేసి హత్య చేశారన్న విషయం నిర్ధారణ అయింది. కొంతమంది వ్యక్తులను కూడా విచారించారు. 50 మంది సాక్షులను అధికారులు విచారించారు.