ఆ బాబా పన్నుగాటు పడితే
ఎంతోమంది దొంగ బాబాలు వస్తున్నారు పోతున్నారు. అయినా ప్రజలు ఇంకా మేలుకోవడం లేదు. జనాల బలహీనత దొంగ బాబాలకు పెట్టుబడి. నిమ్మకాయల బాబా, బొట్టు బాబా, మంత్రాల [more]
ఎంతోమంది దొంగ బాబాలు వస్తున్నారు పోతున్నారు. అయినా ప్రజలు ఇంకా మేలుకోవడం లేదు. జనాల బలహీనత దొంగ బాబాలకు పెట్టుబడి. నిమ్మకాయల బాబా, బొట్టు బాబా, మంత్రాల [more]

ఎంతోమంది దొంగ బాబాలు వస్తున్నారు పోతున్నారు. అయినా ప్రజలు ఇంకా మేలుకోవడం లేదు. జనాల బలహీనత దొంగ బాబాలకు పెట్టుబడి. నిమ్మకాయల బాబా, బొట్టు బాబా, మంత్రాల బాబా ఇలా రకరకాలుగా బాబాలు వస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త బాబా పుట్టుకొచ్చాడు. కనివిని ఎరుగని విధంగా కోరికే బాబాగా ఫేమస్ అయ్యాడు. ఆ బాబా కొరికితే అదృష్టం కలిసి వస్తుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక సమస్యలు ఉన్నవారికి నయం అవుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అసలు కొరికే బాబా ఎవరు?
వ్యవసాయం నుంచి బాబా అవతారం…..
ఈ బాబా యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు మండలం పూల్లాయి గూడెంలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం తనకు సరిపడదని తన నోటి మహిమ తోనే డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. రాత్రికి రాత్రే బాబా అవతారం ఎత్తాడు. తనకు దేవుడు ఆవహిస్తాడని అందరికీ నమ్మకం కలిగించాడు. ఈ బాబా కొరికితే అదృష్టం కలిసివస్తుందని ప్రచారం చేశాడు. పన్నుకాట్లు పడితే అన్నీ సమస్యలు దూరమని అనుచరులతో చెప్పించాడు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు. ఒక్క పన్ను కాటుకు వంద రూపాయల చొప్పున తీసుకుంటాడు. ఎక్కువ పన్ను గాట్లు పడితే ఎక్కువ పైసలు లాగుతాడు. ఇతని దగ్గరికి వచ్చే ఆడవాళ్లను ఎక్కడపడితే అక్కడ కొరకడం, ఒళ్లంతా తాకడం చేస్తుంటాడు. తన నీచమైన అకృత్యాలను ఆడవారి మీద చూపిస్తాడు. మగవారైతే ఒళ్లంతా కొరకడం చేస్తుంటాడు. ఒక్క పన్ను గాటు పడితే కొంచెం అదృష్టమని, ఎక్కువ పన్ను గాట్లు పడితే చాలా అదృష్టమని నమ్మిస్తాడు. ఎక్కువ మానసిక బాధలు ఉంటే మగవారిని కింద పడుకోబెట్టి కాళ్లతో తొక్కుతాడు.
అక్కడ టెంకాయ కొంటే……
మంత్రించడానికి నిమ్మకాయలు, కొబ్బరికాయలు తన వద్దనే తీసుకోవాలని గట్టిగా చెబుతాడు. ఒక్కొక్క కొబ్బరికాయ వంద రూపాయలకు అమ్ముతాడు. ఇంతకుముందు ఈ గూడెం ఎవరికీ తెలియదు . కానీ ఇప్పుడు ఇలా ఈ దొంగ బాబా వల్ల పుల్లయ్య గూడెంకు జనం రావడం మొదలుపెట్టారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, మానసిక సమస్యలను దూరం చేయడం, ఎలాంటి బాధలయినా తొలగిస్తానని వీటిని టార్గెట్ గా చేసుకొని ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నాడు. ఎంతమంది దొంగ బాబాలు వచ్చినా ప్రజలు వాళ్లందర్నీనమ్ముతూనే ఉంటారు. జనం నమ్మకమే ఈ దొంగ బాబాలకు పెట్టుబడి.